Thursday, September 25, 2014

ratios

if u learn only ratios topic then u can do 40% of paper as in each and every topic ratios are used


1) if a:b=2:3 &b:c=3:4 then find a:b:c ?

short cut :   a:b        2 : 3
                       b:c          3 : 4


 a:b:c = 2*3 : 3*3 : 3*4
           = 6: 9: 12   = 2 : 3 : 4

2) if a:b=2:3,b:c=4:5,c:d=3:4 then find a:b:c

short cut 


Thursday, January 21, 2010

వందేమాతరం

నేనొక ప్రైవేటు వీధిబడి లో చదువుకునే రోజుల్లో ఉదయాన్నే బడికి పోగానే అసెంబ్లీగానీ , ఆ రోజు నాటి వార్తలు చదవడం అనో, వందేమాతరం పాడడమనో, మా హెడ్మాస్టర్ ఉపన్యాసం వినడం అనో ఉండేది కాదు. ఏడవ తరగతి పాస్ అయ్యి హైస్కూల్ పేరు తో మా వీధవతల మున్సిపాలిటీ స్కూల్ లో చేరేవరకు ఇవేవీ తెలీవు.
మా స్కూల్ అసెంబ్లీ లో ఇద్దరు కోయిలలాంటి అమ్మాయిలు వందేమాతరం పాడుతూ వుంటే మిగిలిన వాళ్ళు వాళ్ళతో పాటు పాడాలన్న మాట. వాళ్ళు పాట పాడుతున్నంత సేపూ నాకు లేని నిద్ర వచ్చేది. దేశభక్తి గీతం అంటే హుషారుగా , నీరసం గా వున్నవాడికి భావోద్రేకం కలిగించి, మనిషిని ఉత్తేజింప జేసి వాడిని కార్యోన్ముఖుడిని చెయ్యాలి. నాకేంటో లేని నిద్ర వచ్చేస్తూ వుండేది. ఇదే సంగతి మా బామ్మ తో చెబితే, నిజమేరా భడవా , అలానే ఉంటుంది సుమా! నా దగ్గర అంటే అన్నావు గానీ ఇంకెక్కడా అనకు, నీకు బొత్తిగా దేశభక్తి లేదనుకుంటారు అని అన్నది ఊరుకోకుండా కొన్ని పుస్తకాలు నా ముందు పడేసింది. ఈ జాతీయ గీతం మీద చాలా వ్యాసాలే వున్నాయి, వీలైతే అన్నీ చదువు, తర్వాత నీకు నచ్చిన అభిప్రాయాన్ని నువ్వు ఎర్పర్చుకో అని చెప్పింది. అలా నా ముందు పడేసిన పుస్తకాల్లో ఒకటి బంకిం చంద్ర రాసిన "ఆనంద్ మట్".

వందేమాతరం గేయం పూర్తి పాఠం ఇలా ఉంటుంది:
వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్య శ్యామలాం మాతరం
శుభ్రజ్యోత్స్నా పులకిత యామినీం
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం, వరదాం మాతరం
సప్త కోటి కంఠ కల కల నినాద కరాళె
ద్విసప్త కోటి భుజైర్దుత ఖరకరవాలే,
అబలాకేనో మా! ఏతో బలే!
బహుబల ధారిణీం నమామితారి ణీం
రిపుదలవారి ణీం మాతరం
తుమీ విద్యా, తుమీ ధర్మ
తుమీ హరి, తుమీ కర్మ
త్వం హి ప్రాణః శరేరీ
బహుతే తుమీ మాం శక్తి
హృదయే తుమీ మాం భక్తి
తోమారయీప్రాప్తి మాగధం మందిరే మందిరే!!
త్వం హి దుర్గా దశ ప్రహార ధారిణీం
కమల కమల దళ విహారిణీం
పాణీ విద్యాదాయినీ నమామిత్వాం
నమామి కమలాం, అమలాం, అతులాం
సుజలాం సుఫలాం మాతరం
వందేమాతరం
శ్యామలాం సరళాం సుస్మితాం భాషిణీం
ధరణీం భరణీం మాతరం
[ఎర్ర రంగు లో వున్నలైన్లు వివిధ పోరాటాల వల్లా, ఉద్యమాల వల్లా , అభ్యంతరాల వల్లా కాలక్రమేణా తొలగించబడ్డాయి. ఆకుపచ్చ రంగులో వున్న లైన్లు ప్రస్తుతానికి మనం పాడుతున్నవి.]
18 వ శతాబ్దం లోని రెండవ అర్ధభాగం లోని నవాబుల పరిపాలనకు వ్యతిరేకమైన ప్రజల తిరుగుబాటు ఈ నవల కి కధావస్తువు. ఈ నవాబులు భోగలాలసులై బ్రిటిష్ కంపెనీలకు తొత్తులై ప్రజలను ఏ విధంగా కొల్లగోట్టేవారో వర్ణిస్తుంది ఈ నవల. ఆనాటి బెంగాల్ కరువు దృశ్యాలను చక్కగా చూపెట్టాడు బంకిం చంద్ర చట్టర్జీ. ఈ నవల రచనా కాలం 1882 .
మాతృదేశాన్ని కీర్తించడమే ఈ గేయం సారాంశం. నవలలో ఈ గేయాన్ని ఈ ముందు మాటలు చెప్పి ప్రారంబిస్తాడు"మాకు దేశం తప్ప ఇంకొక తల్లి తెలియదు. 'జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపి గరీయసీ' మా మాట జన్మ భూమి, మాకు మరొక తల్లి తండ్రి లేరు. భార్యా పిల్లలు లేరు. ఇల్లు వాకిలి లేదు. మాకు సర్వమూ దేశమతే!సుజల, సుఫల, మలయజ, శీతల, సస్యశ్యామల అయిన మాటే మాకు సర్వం."
దీని లో దుర్గను, లక్ష్మీ సరస్వతులను పేర్కొన్నాడు. మాత్రుభూమే సర్వస్వమని చెప్పడానికి ఉద్దేశించబడినా దీనిలో మత ప్రమేయమున్నది. తిరుగుబాటు దారులు దైవభక్తి కలవారు; దైవ పూజ చేసేవారు.వారు పూజించే మూర్తులను ఇలా వర్ణిస్తాడు రచయిత:"ఒక ప్రఖాండ చతుర్భుజ మూర్తి విగ్రహం ఉంది. శంఖ చక్ర గదా పద్మదారి కౌస్తుభ శోభితమూ అయివుంది ఆ మూర్తి. ఎదురుగా సుదర్శన చక్రం స్థాపితమై ఉంది. మధుకైటభులు రక్త ప్రవాహం లో మునిగి ఉన్న ఒక చిత్రం ఉంది. దక్షిణ వైపు సరస్వతి పుస్తకం ఉంది. యంత్రం దగ్గర పెట్టుకుని రాగ రాగిణులు అయిన చెలికత్తెలు పరివేష్టించి ఉండగా కూర్చుని ఉంది. విష్ణువు అంకస్థలం లో ఒక మోహినీ మూర్తి విగ్రహం ఉంది. ఈ మూర్తి లక్ష్మి సరస్వతులకంటే సుందరంగా ఉంది; శోభ గా ఉంది.
సుందరంగానూ , శోభ గానూ ఉన్న ఆ మూర్తి ని "అమ్మ" అన్నాడు. ఆమె వర్ణన నాకు సరిగ్గా గుర్తు లేదు
అంటే కాదు, "హిందూమతం మరుగున పడుతున్న సమయం అది. అనేకులు హిందూ మతాన్ని పునరుధరించుకోనడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రోజు రోజు కూ సంతానుల సంఖ్యా పెరిగిపోతోంది. ప్రతి నెలా వేలకొద్దీ గ్రామీణులు సంతాన సాంప్రదాయంలో ప్రవేశించి ముసల్మానుల శాసనాన్ని అతిక్రమిస్తున్నారు" అని హిందూ-ముస్లింల సమస్యను ముందుంచాడు.
ఈ ద్రుష్టి తో చూస్తె మతపరమైన అంశాలెన్నో ఉన్నాయి నవలలో. ఇవి సనాతన ధర్మపరాయణులకు మాత్రమె అంగీకార యోగ్యం గా ఉంటాయి. 'హిందూ' మతం లో ని సంస్కరణ ఉద్యమాలలో వీటికి తావు లేదు. ఉదాహరణ కి విగ్రహారాధనని వ్యతికేరేకించే వారు వీటిని వ్యతిరేకిస్తారు. ఇదే విధం గా బౌద్ధులు, సిక్కులు కూడా వీటిని అంగీకరించరు. దక్షిణాదిన వీటిని వ్యతిరేకించే ద్రావిడ కజగం లాంటి ఉద్యమాలున్నాయి. ఇక ముస్లిం లు, క్రైస్తవులు సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వారే కదా! ఈ విధం గా మతపరం గా చూస్తె మనదేశం లోని కొందరిని మాత్రమె, అదీ సనాతన ధర్మ పరాయణులను మాత్రమె ఆకట్టగలుగుతుందీ గేయం.
కానీ ఈ గేయం జాతీయోద్యమం లో నిర్వహించిన పాత్ర మరో విధం గా ఉంది. 1905 లో బ్రిటిష్ సామ్రాజ్యవాదులు బెంగాల్ ను విభజించ పూనుకున్నారు. దానికి వ్యతిరేకం గా బెంగాల్ లోనే పెద్ద జాతీయోద్యమం బయలుదేరింది. దేశమంతా వ్యాపించింది. బలీయమైన ఈ ఉద్యమాన్ని చూచి బ్రిటిష్ పాలకులు భయపడి బెంగాల్ విభజనను తాత్కాలికంగా మానుకున్నారు.
వందేమాతరం గేయం ఈ ఉద్యమం లో గొప్ప పాత్రను నిర్వహించింది. అప్పటికే గణనీయమైన జనాభా గా ఉన్న ముస్లిం లు, క్రైస్తవులు ఈ వుద్యమం లో ఏ మేరకు పాల్గొన్నారు అనేది చర్చనీయమైన అంశం అయినప్పటికీ బెంగాల్ లోని విశాల ప్రజానీకాన్ని ఈ గేయం ఇక్యం చేయగలిగింది, పోరాటం లోకి సమీకరించగలిగింది. ప్రజానీకానికి ఈ గేయపు పూర్వాపరాలు తెలీక పోయినా, మాతృదేశపు భక్తి, దేశాన్ని విభాజించకూడదనే ఆకాంక్ష తో వారీ గేయాన్ని అనుసరించారు.అయితే ఆ సమయం లో ఈ గేయం నిర్వహించిన పాత్ర ని గీటు రాయిగా చేసుకుని దీనిని ఒక జాతీయ గేయం గా అనుసరించలెం కదా! మన రాజ్యాంగ ఆముఖం లో మన దేశం "ఒక సర్వ సత్తాక సామ్య వాద లౌకిక రిపబ్లిక్" అని గొప్పగా చెప్పబడినప్పుడు మత పరం గా చర్చనీయాంశమైన ఒక గీతం దేశానికి ఎందుకు జాతీయ గేయం గా మారింది? లౌకికతత్త్వం అని చెప్పుకుంటున్న రాజ్యాంగ నేతలు ఇప్పటికీ ఇప్పటికీ దేశప్రజలకి ఏ విధమైన భారీ ప్రాజెక్టులనైనా అంకితం చేసేప్పుడు ఒక మతానికి సంబంధించిన ఆచార వ్యవహారాల్నే ఎందుకు పాటిస్తుంది? ఇవన్నీ నాకప్పుడు ఉదయించిన ప్రశ్నలు....చిత్రమేమంటే ఇప్పటికీ ప్రశ్నలు గానే మిగిలి పోయాయి! చస్, నాకు బుర్ర పాడైన్నట్లుంది.

(పైన
చెప్పిన దానికి మూలం , "భారత జనతా ప్రజాతంత్ర విప్లవం - కార్యక్రమం ఒక
వివరణ" అనే పుస్తకం నుండి. రచయిత "దేవులపల్లి వెంకటేశ్వర రావు")